Karthika Deepam 2 : కార్తిక్, జ్యోత్స్నల పెళ్ళి.. ఏం నటిస్తున్నావే!
on Sep 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -143 లో... దీప దగ్గరికి నరసింహా రావడంతో.. ఎందుకు వచ్చావ్ అంటూ దీప, అనసూయలు కోప్పడతారు. నాకు ఇల్లు ఇవ్వు అంటూ అడుగుతాడు. నువ్వు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అంటూ అనసూయ లోపలికి వెళ్ళి కత్తిపీట తీసుకొని వస్తుంది. అప్పుడే నర్సింహాను చూసి శౌర్య భయపడుతుంది. నర్సింహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా పై నుండి జ్యోత్స్న చూస్తుంది. నరసింహా వెళిపోతుంటే జ్యోష్న తనతో వెళ్లి మాట్లాడుతుంది. దీపపై నరసింహాకి కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది.
నీ పెళ్ళాం నిన్ను వదిలేసి ఇష్టం వచ్చినట్లు ఉంటుంటే.. ఏం చేస్తున్నావ్ .. చేతకాని వాడివి అంటూ జ్యోత్స్న అంటుంది. నరసింహ కోపంగా ఆ దీపని చంపేస్తా.. నాకు అడ్డు ఉండదు నీకూడా అడ్డు ఉండదు. మీరు ఒకే అనండి ఏం ప్రాబ్లెమ్ రాకుండా చూసుకోండని అనగానే జ్యోత్స్న సరే అంటుంది. ఆ తర్వాత శౌర్య భయపడుతుంటే దీప, అనసూయ దైర్యం చెప్తుంటారు. ఆ తర్వాత నరసింహా ఇంటికి వెళ్లి డ్రింక్ చేస్తూ శోభని ఆమ్లెట్ వేసుకొని రమ్మంటాడు. శోభ తనపై కోప్పడుతుంది.
మరొకవైపు కార్తీక్, కాంచనలు సుమిత్ర ఇంటికి వెళ్తారు. అందరిని రమ్మన్నానవేంటని జ్యోత్స్నని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే పంతులు వస్తాడు. ఎంగేజ్ మెంట్ వద్దు.. డైరెక్ట్ పెళ్లి ముహూర్తం అన్నాడు కదా బావ.. అందుకే పెళ్లి ముహూర్తం పెట్టడానికి పిలిపించా అని జ్యోత్స్న అంటుంది. రెండు రోజుల్లో ముహూర్తం పెట్టమని.. ఆల్రెడీ జ్యోత్స్న పంతులికి చెప్తుంది పంతులు రెండు రోజుల్లో ముహూర్తం ఉంది.. మళ్ళీ ఆరు నెలల తర్వాతే అని అంటాడు. దాంతో అన్ని రోజులు ఎందుకని డిస్కషన్ చేసుకొని రెండు రోజుల్లో పెళ్లి చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత కార్తీక్ వెళ్తుంటే.. శౌర్య కన్పించి రాత్రి బూచోడు వచ్చాడని చెప్తుంది. దాంతో దీప దగ్గరికి కార్తీక్ వెళ్లి అడుగుతాడు. అత్తయ్య బుద్ది చెప్పింది. ఇక రాడని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి గుడ్ న్యూస్ చెప్పవా అని అడుగుతుంది. పెళ్లి గురించి అని జ్యోత్స్న అంటుంది. కాశీ, స్వప్పల పెళ్లి గురించి అయి ఉంటుందా అని దీప అనుకుంటుంది. మీ పెళ్లి గురించి అనుకుంటున్నావు కదా దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. బావతో నాకు పెళ్లి రెండు రోజుల్లో అని జ్యోత్స్న చెప్పగానే.. అవునా మంచి మాట చెప్పావని దీప అనగానే.. ఏం నటిస్తున్నావని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read